ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం ఏకో షాప్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పరిశీలన

హిందూపురం, జూలై 23 (మీకోసం న్యూస్):

ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 'వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్' కార్యక్రమంలో భాగంగా హిందూపురంలో ఏర్పాటు చేసిన ఏకో షాప్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ వి. మల్లికార్జున గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మెప్మా డిసిఎం ఎల్. గంగులయ్య, స్వయం సహాయక సంఘ సభ్యురాలు సుజాత తదితరులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.

అనంతరం కమిషనర్ మల్లికార్జున మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రజలు విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు. "ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణమే మన లక్ష్యం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత" అని ఆయన పేర్కొన్నారు. ఏకో షాప్‌ల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందుతుందని తెలిపారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు