ఆర్థిక సాయం అందించిన ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులు

హిందూపురం, జూలై 23 (మీకోసం న్యూస్): దూపురం మండలం బీరేపల్లి గ్రామానికి చెందిన మాల శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి చెందడం పట్ల ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ, శ్రీనివాసులు భార్య శాంతమ్మకు తక్షణ అవసరాల నిమిత్తం రూ.7,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ, మృతుడి కుటుంబానికి తమవంతు సహాయం అందించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. శ్రీనివాసులు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులు కురుబ క్రిష్టప్ప, డీలర్ రామాంజనేయులు, లక్ష్మీనారాయణ, మారుతి, జయచంద్ర, రమేష్, బాలకృష్ణ, మహేష్, రాము, గురు ప్రసాద్, శ్రీనివాసులు, నవీన్, అరవింద్, తిరుమలేష్, నాగభూషణ, ముద్దప్ప, రామాంజనేయులు, సోమశేఖర్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు