ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరపాల్సిన బాధ్యత కలిగిన నాయకులు వ్యక్తిగత విమర్శలు, ఆధారరహిత ఆరోపణలకు దిగడం తగదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
మంత్రి సవితమ్మ తన నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజల ఆదరణ పొందుతున్న నాయకురాలిపై అసత్య ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరికాదని విమర్శించారు.
ప్రజలకు ఉపయోగపడే సూచనలు, అభివృద్ధికి దోహదపడే చర్యలపై దృష్టి సారించాలని ఉషశ్రీ చరణ్ దంపతులకు సూచించిన అనుసూయమ్మ.. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, అసత్య ప్రచారాలను నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

0 కామెంట్‌లు