పెనుకొండ, జూలై 22 (మీకోసం న్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం శెట్టిపల్లి గ్రామంలో రాష్ట్ర మంత్రి ఎస్. సవితమ్మ ఆదేశాల మేరకు 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులకు పంటల బీమా, పంటలకు సోకే తెగుళ్లు, క్రిమిసంహారక మందుల వినియోగం, మందుల పిచికారీ విధానాలు, పంట దిగుబడులు, వ్యవసాయంలో లాభనష్టాలపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. రైతుల సందేహాలకు సమాధానాలు ఇస్తూ పంటల నిర్వహణపై పలు సూచనలు చేశారు.
కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏవో చందన, మండల మాజీ కన్వీనర్ సిద్ధయ్య, ఎస్టీ సెల్ నాయకుడు గోపాల్ నాయక్, సీనియర్ నాయకులు బట్టా రామచంద్ర, నాగే నాయక్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు