ఎమ్మెల్యే కందికుంటను మర్యాదపూర్వకంగా కలిసిన టౌన్ సీఐ వెంకటేశ్వర్లు

కదిరి టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బి. వెంకటేశ్వర్లు బుధవారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీఐ వెంకటేశ్వర్లుకు శుభాకాంక్షలు తెలియజేశారు. కదిరి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని ఆకాంక్షించారు. ప్రజల భద్రత, ప్రశాంత వాతావరణం కోసం పోలీసు శాఖకు అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సీఐ వెంకటేశ్వర్లు ప్రజాసేవలో నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

-మీకోసం న్యూస్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు