రామగిరి బంగారు గనుల పరిశీలన.. గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన


 రామగిరి, జూలై 15 (మీకోసం న్యూస్): రాష్ట్ర గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర రామగిరి బంగారు గనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, పెనుకొండ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు, ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్‌తో కలిసి బంగారు గనులను పరిశీలించి, అక్కడి పరిస్థితులు మరియు అభివృద్ధి అవకాశాలపై అధికారులతో సమీక్షించారు.

తదుపరి రామగిరి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన నేతలు, అనంతరం పంచాయతీరాజ్ శాఖ అతిథి గృహంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గనుల అభివృద్ధి, స్థానిక ఉపాధి అవకాశాలు మరియు ప్రభుత్వ ప్రణాళికలపై మంత్రి మీడియాకు వివరించారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు