ఈ కార్యక్రమంలో చమన్ సాబ్ సతీమణి, పరిటాల శ్రీరామ్ రామగిరి మండలం మాజీ ఎంపీపీ రమీజ్ బేగం, ఫౌండేషన్ ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా. ఉమర్ ముక్తార్ పాల్గొన్నారు. కళాశాలలోని సుమారు 2,000 మంది విద్యార్థినులకు గైనకాలజీ, కంటి వైద్యం (ఆప్తాల్మాలజీ), దంత వైద్యం, జనరల్ మెడిసిన్ విభాగాల్లో నిపుణుల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు.
విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే విధంగా నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని కళాశాల యాజమాన్యం, విద్యార్థినులు అభినందించారు. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా చమన్ సాబ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న డా. ఉమర్ ముక్తార్ సేవలను పలువురు ప్రశంసించారు.
-మీకోసం న్యూస్

0 కామెంట్‌లు