మన పెనుకొండ - మన సవితమ్మ స్థానికుల విజ్ఞప్తికి స్పందన.. దర్గాపేటలో నేడు పబ్లిక్ కొళాయి ఏర్పాటు

పెనుకొండ, జూలై 15 (మీకోసం న్యూస్): పెనుకొండ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి  ఎస్. సవితమ్మ ఆదేశాల మేరకు పెనుకొండ పట్టణంలోని దర్గాపేట, ఆర్టీసీ బస్టాండ్ సమీప ప్రాంతాన్ని స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు బుధవారం పరిశీలించారు.
ఆ ప్రాంతంలో తాగునీటి కోసం పబ్లిక్ కొళాయిలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు విజ్ఞప్తి చేయగా, మున్సిపల్ ఇంజనీర్ రామ్మోహన్ సమస్యను పరిశీలించి రేపే పబ్లిక్ కొళాయి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో బాబుల్ రెడ్డి, స్థానిక నాయకులు అస్లాం, మన్నాన్, బండ నూర్, బర్కత్‌తో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు.
మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు