కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలిపెనుకొండలో సీఐటీయూ కరపత్రాల విడుదల

పెనుకొండ, జూలై 15 (మీకోసం న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30, 31 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం పెనుకొండ పట్టణంలోని గాంధీ కూడలిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి హరి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, మండల కన్వీనర్ బాబావలి మాట్లాడుతూ అన్ని రంగాల కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. కనీస వేతనాల అమలు, జీతాల పెంపు, ఔట్సోర్సింగ్ కార్మికులను శాశ్వతీకరణ, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే కలెక్టరేట్ ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటేష్, జబ్బర్, సివిల్ సప్లై యూనియన్ నాయకుడు బాబు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు వెంకట్‌రాముడు, తోపుడు బండ్ల సంఘం నాయకులు హబీబ్, రాజురావు, మెహతాబ్ ఖాన్, ఆటో యూనియన్ నాయకులు ఆజం, ఎజాజ్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు నరసింహ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

-మీకోసం న్యూస్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు