-మీకోసం న్యూస్ | ప్రతినిధి |
సోమందేపల్లి: జేఈఈలో ప్రతిభ కనబర్చి కేరళలోని ఐఐటీ పాలక్కాడ్‌లో సీటు సాధించిన స్నేహ దీక్షితను సోమందేపల్లి మండల కేంద్రంలోని జేజేఆర్ నగర్‌లో దళిత, బహుజన నాయకులు ఘనంగా సన్మానించారు.
మాజీ ఎంపీటీసీ దండోరా కిష్టప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూలమాలలు, శాలువాలతో ఆమెను అభినందించారు.
స్నేహ దీక్షిత పెనుగొండ ప్రాంతానికి చెందిన ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు రామాంజనేయులు కుమార్తె. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె కృషి, పట్టుదలతో జేఈఈలో ఉత్తమ ర్యాంకు సాధించి దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీలో ప్రవేశం పొందడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ దండోరా కిష్టప్ప మాట్లాడుతూ, స్నేహ దీక్షిత విజయం బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. విద్యనే అభివృద్ధికి మార్గమని, మరింత మంది విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ నడిమిపల్లి వెంకటేష్, మాజీ సర్పంచ్ బి. నరసింహులు, జనసేన నాయకుడు రంగేపల్లి నాగరాజు, టీచర్ కిష్టప్ప, పెయింటర్ రామాంజనేయులు, వైసీపీ నాయకుడు గంగాధర్‌తో పాటు ఏ.బి. ఆంజనేయులు, వరలక్ష్మి, శిరీష, సంజీవరాయుడు, మణెమ్మ, నాగరాజు, గంగాధ్రి, ఆంజనేయులు, ఏ. రామాంజనేయులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు