అనంతపురం, జూలై 23 (మీకోసం న్యూస్): మడకశిరకు చెందిన మాజీ ఆరోగ్య శాఖ రిటైర్డ్ అధికారి ముచ్చోళ్ల నంజుండప్ప మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మడకశిర రాజకీయ ప్రస్థానంలో ఒక వెలుగు వెలిగిన మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ బుడ్డన్న గారికి క్లాస్‌మేట్ అయిన నంజుండప్ప సేవలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు.
అనంతపురంలోని మారుతి నగర్‌లో ఉంచిన నంజుండప్ప పార్థివదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతపురం పోలీస్ చిన్నప్ప గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు నాయకులు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు రాష్ట్ర శాశ్వత ఉపాధ్యక్షులు ఎస్‌కేయూ ఓబులేశు, జిల్లా గౌరవ అధ్యక్షులు పోలీస్ చిన్నప్ప, ఉరుముల కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పూలకుంట రాము, జిల్లా మహిళా అధ్యక్షురాలు సాకే శ్రీదేవి, అనంతపురం నగర ఉపాధ్యక్షులు బి. సురేంద్ర, నగర ప్రధాన కార్యదర్శి వల్లూరి బాబు, పాలలకుంట ఉరుముల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని నంజుండప్ప చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
0 కామెంట్‌లు