చిలమత్తూరు: సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజును పోలీసులు చిలమత్తూరు మండలం కోడూరు చెక్‌పోస్ట్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేసిన ఆరోపణలకు నిరసనగా ఎంఎస్ రాజు అనంతపురంలో ధర్నా చేపట్టగా, ఆయనకు మద్దతుగా బయలుదేరిన పూల నాగరాజు వాహనాన్ని పోలీసులు నిలిపివేసి ముందుకు వెళ్లనివ్వలేదు.
ఈ సందర్భంగా పూల నాగరాజు మాట్లాడుతూ, శాంతియుతంగా సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని విమర్శించారు.
– మీకోసం న్యూస్

0 కామెంట్‌లు