సోమందేపల్లిలో సుడిగాలి పర్యటన.. సర్వే పురోగతిపై సమీక్ష


 మీకోసం న్యూస్ I సోమందేపల్లి 

సోమందేపల్లి, జూలై 9: రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, సోమందేపల్లి తహసీల్దార్ మారుతి గురువారం మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ప్రత్యేక సర్వే కార్యక్రమం పురోగతిని పరిశీలిస్తూ గ్రామాల వారీగా సమీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, గ్రామ నాయకులు, అంగన్‌వాడీ టీచర్లు, యానిమేటర్లు తదితరులతో సమావేశమై సర్వే పనులను మరో రెండు రోజుల్లో 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

పర్యటనలో భాగంగా బాబయ్యపల్లి, వెలిదడుకుల, పత్తికుంటపల్లి, గుడిపల్లి, చాలాకూరు, కేతగానిచెరువు, నడింపల్లి, రూకలపల్లి, కొల్లకుంట, జూలుకుంట, ఈదులపురం గ్రామాలను సందర్శించి సర్వే పురోగతిని పరిశీలించారు.

అనంతరం చాలాకూరు గ్రామంలో నిర్వహించిన హౌసింగ్ గ్రామసభలో కూడా చైర్మన్ వెంకటరమణ, తహసీల్దార్ మారుతి పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు