ఘనంగా ఉషశ్రీ చరణ్ జన్మదిన వేడుకలువైఎస్సార్ విగ్రహానికి నివాళి.. కేక్ కట్ చేసి సంబరాలు

సోమందేపల్లి, జూలై 16 (మీకోసం న్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ జన్మదిన వేడుకలను సోమందేపల్లి వైఎస్సార్ సర్కిల్‌లో గురువారం వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
మండల వైసీపీ కన్వీనర్ గజేంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ డీసీ అశోక్, పట్టణ అధ్యక్షుడు గోవిందమ్మగారి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు గట్ట మంజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కన్వీనర్ గజేంద్ర మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఉషశ్రీ చరణ్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ కన్వీనర్ నారాయణరెడ్డి, ఉప కన్వీనర్ ఆదినారాయణరెడ్డి, సర్పంచ్ నరసింహామూర్తి, కంబాలప్ప, కిష్టప్ప, మండల బూత్ కన్వీనర్ సూర్యప్రతాప్ రెడ్డి, యువజన అధ్యక్షుడు జీత్తు రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు బాలాజీ, యూత్ నరసింహమూర్తి, ట్రాక్టర్ శ్రీరాములు, బండ శివ, ఇమామ్వాలితో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు