అనంతపురం, జూలై 16 (మీకోసం న్యూస్): జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బ్యూరో ప్రతినిధి సీపీ వేణుగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జాప్ రాష్ట్ర అధ్యక్షుడు పున్నంరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి గురువారం నియామకపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో జాప్ సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పాత్రికేయుల సమస్యలను అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే పాత్రికేయుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు.

0 కామెంట్‌లు