గోరంట్ల, జూలై 4 (మీకోసం న్యూస్): గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి క్రాస్ వద్ద శనివారం సాయంత్రం పోలీసులు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకుని భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.
సీఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో AP39UV7477 నంబర్ గల ఐచర్ వాహనాన్ని అడ్డుకుని పరిశీలించారు. అనంతరం సీఎస్‌డీటీ శ్రీధర్, వీఆర్వో మన్‌సూర్ సమక్షంలో వాహనంలో ఉన్న 250 బస్తాల బియ్యాన్ని (సుమారు 12 టన్నులు) సీజ్ చేశారు.
ఈ ఘటనలో ఆదోని ప్రాంతానికి చెందిన చంద్ర, వీరేశప్ప అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ మేరకు గోరంట్ల పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం. 75/2026గా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4) తో పాటు నిత్యావసర వస్తువుల చట్టం (Essential Commodities Act) సెక్షన్ 7(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

0 కామెంట్‌లు