అమరాపురం, జూలై 19 (మీకోసం న్యూస్): మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం అగ్రహారం గ్రామంలో నూతన బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) సెల్ టవర్ నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారథి, జిల్లా అధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొని నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మొబైల్ నెట్‌వర్క్, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. టవర్ నిర్మాణం పూర్తయిన తర్వాత అగ్రహారం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ మూర్తి, రాష్ట్ర ఒక్కలిగా కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు