పెనుకొండలో NH-44 పక్కన కొత్తగా ప్రారంభమైన "కపూర్‌స్ కేఫ్" – ప్రయాణికులకు మరో ఆకర్షణ!

పెనుకొండ, మీకోసం న్యూస్:

బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారి (NH-44)పై ప్రయాణించే వారికి మరో నాణ్యమైన ఫుడ్ డెస్టినేషన్ అందుబాటులోకి వచ్చింది. పెనుకొండ సమీపంలో Kapoor's Cafe & Kapoor's Chaat Bhandaar పేరుతో ఆధునిక సౌకర్యాలతో కూడిన రెస్టారెంట్‌ను తాజాగా ప్రారంభించారు. 

ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ కోర్టులో పంజాబీ వంటకాలు, నార్త్ ఇండియన్ స్పెషల్స్, సౌత్ ఇండియన్ టిఫిన్స్, ఢిల్లీ చాట్స్, స్వీట్స్, లస్సీ, ఫిల్టర్ కాఫీ వంటి అనేక రకాల వెజిటేరియన్ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు సేవలు అందించనున్నట్లు అక్కడి బోర్డుల ద్వారా తెలుస్తోంది.

రెస్టారెంట్‌లో ఏసీ డైనింగ్ హాల్, సంప్రదాయ చాపల (మంచం) సీటింగ్, కుటుంబాల కోసం ప్రత్యేక విభాగాలు, కార్పొరేట్ బఫే, పిల్లల కోసం సౌకర్యాలు, పరిశుభ్రమైన వాష్‌రూమ్స్, బేబీ కేర్ రూమ్, విశాలమైన కార్ పార్కింగ్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు ఆకట్టుకుంటున్నాయి. 


అదే ప్రాంగణంలో 180 కిలోవాట్ల సామర్థ్యంతో అల్ట్రాఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం విశేషం. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణించే వారికి కూడా ఇది ఉపయోగకరంగా మారనుంది.

ప్రకృతి అందాల నడుమ, కొండల సుందర దృశ్యాలతో కూడిన ఈ కొత్త ఫుడ్ డెస్టినేషన్ ప్రస్తుతం NH-44పై ప్రయాణించే వారిని విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రయాణంలో రుచికరమైన భోజనం, విశ్రాంతి, పరిశుభ్రమైన వాతావరణం కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది. 

📍 స్థలం: NH-44 జాతీయ రహదారి, పెనుకొండ సమీపంలో.
 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు