RAW NTRతో తమకు సంబంధం లేదు: ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం

హైదరాబాద్, జూలై 14 (మీకోసం న్యూస్): హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న ‘RAW NTR’ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదని వెల్లడించింది.
ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అధికారిక సమాచారం కేవలం ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడవుతుందని ప్రకటనలో పేర్కొంది. ‘RAW NTR’ సంస్థ ఎన్టీఆర్‌తో సంబంధం ఉన్నట్లు ప్రజల్లో భ్రమ కలిగించేలా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
అనధికారిక సంస్థలు లేదా వ్యక్తులు చేసే ప్రచారాన్ని అభిమానులు, శ్రేయోభిలాషులు నమ్మవద్దని ఎన్టీఆర్ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ఎన్టీఆర్ పేరుతో నిర్వహించే కార్యక్రమాలపై అధికారిక ప్రకటనలు వచ్చినప్పుడే వాటిని విశ్వసించాలని సూచించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు