రేపటితో SIR ముగింపు ఓటు హక్కు కొనసాగాలంటే మ్యాపింగ్ తప్పనిసరి: తహసీల్దార్ మారుతి


 సోమందేపల్లి, జూలై 13 (మీకోసం న్యూస్):

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం మంగళవారం (జూలై 14)తో ముగియనున్న నేపథ్యంలో, ఇంకా తమ ఓటును మ్యాపింగ్ చేయించుకోని అర్హులైన ఓటర్లు వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సోమందేపల్లి తహశీల్దార్ మారుతి సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితాలో పేరు కొనసాగాలంటే ప్రతి అర్హ ఓటరు తప్పనిసరిగా SIR మ్యాపింగ్ పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

ఓటర్లు తమకు సంబంధించిన అవసరమైన పత్రాలతో సమీప బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) లేదా తహశీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి మ్యాపింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత అధికారులను సంప్రదించి సేవలు పొందాలని సూచించారు.

అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, గడువు ముగిసేలోపు తమ ఓటు వివరాలను ధృవీకరించుకోవాలని తహశీల్దార్ మారుతి కోరారు.

-మీకోసం న్యూస్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు