పాము కాటుతో మహిళ మృతి


 మడకశిర, జూలై 15 (మీకోసం న్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ పాము కాటుకు గురై మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన సాకమ్మ కూలి పనుల నిమిత్తం భీమరాయనపల్లి సమీపంలోని దానిమ్మ తోటలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు పాము కాటు వేసింది. గమనించిన తోటి కార్మికులు ఆమెను వెంటనే మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి కారులో తరలిస్తుండగా, మార్గమధ్యలోనే ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సాకమ్మ మృతితో గొల్లపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు