లేపాక్షి పోలీసుల గ్రామ సమావేశం.. ప్రజలకు భద్రతపై అవగాహన


 లేపాక్షి, జూలై 15 (మీకోసం న్యూస్): ప్రజలతో పోలీసుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం, గ్రామాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేయడం లక్ష్యంగా లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని సడ్లపల్లి మరియు పులమతి గ్రామాల్లో ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి గ్రామ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడిన పోలీసులు దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, మహిళలపై జరిగే నేరాల నివారణ, శారీరక దాడులకు సంబంధించిన చట్టపరమైన అంశాలు, భూ వివాదాలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.

అనుమానాస్పద వ్యక్తులు లేదా ఎలాంటి నేర సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులతో సహకరించాలని సూచించారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు