కృతజ్ఞతలు తెలిపిన నల్లపేట కుటుంబ సభ్యులు


 హిందూపురం, జూలై 15 (మీకోసం న్యూస్): వియత్నాంలో ఇటీవల జరిగిన విషాదకర పడవ ప్రమాదంలో నల్లపేట రవితేజ అకాల మరణం నేపథ్యంలో ఆయన పార్థివదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నల్లపేట కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డా. ఎస్. జైశంకర్, ప్రధానమంత్రి కార్యాలయం (PMO), వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్థివదేహాన్ని త్వరితగతిన స్వదేశానికి చేర్చేందుకు సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ విశేష కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

అదేవిధంగా, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులను పరామర్శించిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి డా. సురేంద్ర, బాలాజీ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు మిట్ట వంశీకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జి.ఎం. శేఖర్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, బంధువులు, మీడియా ప్రతినిధులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సానుభూతి తెలియజేసి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

ఈ క్లిష్ట సమయంలో అందరూ చూపిన మానవత్వం, ఆప్యాయత, సహకారం తమ కుటుంబానికి మరపురాని ఋణంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు