పుట్టపర్తి, జూలై 15 (మీకోసం న్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బుధవారం సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భూసేకరణ, హంద్రీ-నీవా సుజల స్రవంతి (HNSS) పనుల పురోగతిపై సమీక్షించారు.
ఏపీఐఐసీకి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి పనులకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా జిల్లాలోని 195 చెరువులకు నీరు అందించే పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, ఎలాంటి నిర్లక్ష్యం లేదా జాప్యం లేకుండా పనులను నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
అభివృద్ధి పనుల్లో శాఖల మధ్య సమన్వయం పెంచి, ప్రజలకు త్వరితగతిన ప్రయోజనాలు చేకూరేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

0 కామెంట్‌లు