మైలవరం (కడప జిల్లా), జూలై 15 (
మీకోసం న్యూస్): కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్ల గ్రామంలో రూ.3,478 కోట్ల వ్యయంతో చేపట్టనున్న దాల్మియా సిమెంట్ లైన్-2 ప్లాంట్ విస్తరణ పనులకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవితమ్మను కూటమి నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తమ ప్రాంతాలకు సంబంధించిన పలు స్థానిక సమస్యలను వివరిస్తూ వినతిపత్రాలను మంత్రి సవితమ్మకు అందజేశారు. సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి వాటిని పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు