అమరావతి, జూలై 15 (మీకోసం న్యూస్): ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (AP EAPCET-2026) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
ముఖ్యమైన తేదీలు
జూలై 22 నుంచి 31 వరకు: సర్టిఫికెట్ వెరిఫికేషన్
జూలై 25 నుంచి 31 వరకు: వెబ్ ఆప్షన్ల నమోదు
ఆగస్టు 1: వెబ్ ఆప్షన్ల మార్పులకు అవకాశం
ఆగస్టు 6: తొలి విడత సీట్ల కేటాయింపు
ఆగస్టు 7 నుంచి 13 వరకు: కేటాయించిన కళాశాలల్లో రిపోర్టింగ్
ఆగస్టు 10: తొలి సంవత్సరం తరగతుల ప్రారంభం
ఉన్నత విద్యామండలి సూచనల మేరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసే ముందు కళాశాలల గుర్తింపు, గత ఏడాది కట్‌ఆఫ్‌లు, బ్రాంచ్‌ల వివరాలను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. సీటు కేటాయించిన విద్యార్థులు నిర్దేశిత గడువులో కళాశాలలో రిపోర్ట్ చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
0 కామెంట్‌లు